Share News

విమానంలో టీఎంసీ మహిళా ఎంపీకి చేదు అనుభవం.. ఇండిగోకు ఫిర్యాదు..

ABN , Publish Date - May 08 , 2026 | 10:15 AM

గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు మహువా మొయిత్రా ఢిల్లీ బయలుదేరారు. ఇండిగో విమానంలో ఆమె ఢిల్లీకి వెళుతుండగా.. కొంతమంది ప్రయాణికులు ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. టీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విమానంలో టీఎంసీ మహిళా ఎంపీకి చేదు అనుభవం.. ఇండిగోకు ఫిర్యాదు..
Mahua Moitra

న్యూఢిల్లీ, మే 8: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 293 స్థానాల్లో పోటీ చేయగా .. కేవలం 80 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ 207 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇలాంటి సమయంలో టీఎంసీ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాకు ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళితే.. గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు మహువా మొయిత్రా ఢిల్లీ బయలుదేరారు.


ఇండిగో విమానంలో ఆమె ఢిల్లీకి వెళుతుండగా.. కొంతమంది ప్రయాణికులు ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. టీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దొంగ, దొంగ, టీఎంసీ దొంగ’..‘తృణమూల్ (కాంగ్రెస్) వారంతా దొంగలు’.. ‘జై శ్రీరామ్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. మహిళా ఎంపీ గురువారం తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.


‘బీజేపీ సంస్కృతి ఇది. ఎవరైనా ఎందుకు ఆశ్చర్యపోతారు?.. నేను పట్టించుకోలేదు. ఎయిర్‌పోర్టు నుంచి మీటింగ్‌కు వెళ్లిపోయా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను కొంతమంది నాకు ఫార్వర్డ్ చేశారు. నేను దీనిపై ఇండిగో వారికి ఫోన్ చేశాను. ఫార్మల్ కంప్లైంట్ ఇవ్వాలన్నారు. ఫిర్యాదు చేశాను’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

తెలంగాణలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Updated Date - May 08 , 2026 | 10:32 AM