Share News

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

ABN , Publish Date - May 08 , 2026 | 11:35 AM

ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు
Trains cancellations

గుంతకల్లు(అనంతపురం): ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్కోడగామా-జైసిద్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (నం. 17321) రైలును జూన్‌ 12న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం.17322)ను జూన్‌ 15వ తేదీన రద్దుపరిచామన్నారు. యశ్వంతపూర్‌-కోర్బా (నం. 12251) ఎక్స్‌ప్రెస్‏ను జూన్‌ 9, 12 తేదీల్లో, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 12252)ను జూన్‌ 11, 14 తేదీల్లో రద్దు చేశామన్నారు.


pandu1.2.jpgప్రత్యేక రైలు పాక్షిక రద్దు

వాస్కోడగామా-జైసిద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక రైలును పాక్షికంగా రద్దుచేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి రైల్వేలోని కాస్టిల్‌ రాక్‌-కెలేం ఘాట్‌ సెక్షన్‌లో లైన్‌ బ్లాక్‌ అయిన కారణంగా ఈ రైలును ధార్వాడ వరకే నడపనున్నట్లు తెలిపారు. వాస్కోడగామా-జైసిద్‌ (నం. 17321) రైలును ఈనెల 8, 15, 22, 29, జూన్‌ 5 తేదీల్లో వాస్కో నుంచి కాకుండా ధార్వాడ నుంచి నడపనున్నట్లు తెలియజేశారు. వాస్కో-ధార్వాడ సెక్షన్‌లో రైలును పాక్షికంగా రద్దుపరిచామన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 17322)ను ఈనెల 11, 18, 25, జూన్‌ 1 తేదీల్లో జైసిద్‌-ధార్వడ సెక్షన్‌లో మాత్రమే నడుపుతామన్నారు. ధార్వడ-వాస్కో సెక్షన్‌లో రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సిజ్జు.. రూ.5 లక్షలు

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2026 | 11:35 AM