పుస్తకాలొచ్చేశాయ్.. తక్కువ బరువు ఉండేలా ముద్రణ
ABN , Publish Date - May 06 , 2026 | 01:17 PM
నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలపై విద్యాశాఖ ముందస్తుగానే దృష్టి సారించింది.
ఒక వైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్ మీడియం
ప్రతీ పుస్తకానికి క్యూఆర్ కోడ్
పున:ప్రారంభం నాటికే విద్యార్థులకు..
ఇప్పటికే 80 శాతం జిల్లా కేంద్రానికి రాకా..
మెదక్: నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలపై విద్యాశాఖ ముందస్తుగానే దృష్టి సారించింది. ఇప్పటికే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. నెలన్నర తర్వాత బడులు తెరుచుకోనున్నాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థుల చేతుల్లో ఫాఠ్యపుస్తకాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 81 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి. మిగిలిన పుస్తకాలు మూడు నాలుగు రోజుల్లో రానున్నాయి.
పేపర్ మందం కుదింపు..
విద్యార్థులకు బరువును తగ్గించేందుకు వాటిని ముద్రించే కాగితాల మందాన్ని తగ్గించారు. ఒకటి, రెండు తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం పాఠ్యాంశాలు ఒకే పుస్తకంలో ఉండనున్నాయి. ఈ మూడు సబ్జెక్టులకు కలిపి ఒక వర్క్‌బుక్ ఉంటుంది. మూడు నుంచి పదో తరగతి విద్యార్ధులకు ఒక్కో మాధ్యమం, సబ్జెక్టు పుస్తకాలను పార్ట్-1, పార్ట్-2లుగా విభజించి అందించున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ద్విబాషా విధానంలో తెలుగు, ఇంగ్ల్లిష్, ఉర్దూ, మాతృభాషాల్లో ముంద్రించారు. పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్ల్లిష్ లేదా ఉర్దూ బాషల్లో పాఠాలు ఉంటాయి. ఇప్పటి వరకు తెలుగు పాఠ్యపుస్తకాన్ని తెలుగు వాచకంగా ముద్రించే వారు ప్రస్తుతం తెలుగు పరిమళంగా మార్చారు.
జిల్లాలోని 1 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 80 వేల మంది విద్యార్థులకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి 6,11028 పుస్తకాలు అవసరమని విద్యాశాఖ గుర్తించింది. ఇందులో పార్ట్-1 4,33,730 పుస్తకాలకు గానూ.. ఇప్పటి వరకు 3,44,040(81శాతం) పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ఇంకా 89,690 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. వాటిని జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోదాంలో భద్రపరుస్తున్నారు. ప్రతి పుస్తకంపై వరసు సంఖ్య, కూఆర్ కోడ్‌ను ముద్రించడంతో ఉచిత పుస్తకాలు పక్కదారి పట్టకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఏ వరస సంఖ్య పుస్తకాలు ఏ పాఠశాలకు వెళతాయనే అంశాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయనున్నారు. పుస్తకాలు ఈ నెలలో పూర్తిస్థాయిలో గోదాంకు రానున్నాయి. జూన్ మొదటి వారంలో మండలంలోని ఎమ్మార్సీలకు పంపించి, అక్కడి నుంచి సంబంధింత పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.
పునః ప్రారంభం రోజే పంపిణీ..
విద్యార్థులకు పాఠశాలలు పునః ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తాం. విడుతల వారీగా పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 81శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మిగితావి కూడా త్వరలోనే వస్తాయి. పుస్తకాలను గోదాములో నిల్వ చేస్తున్నాం. పూర్తి స్ధాయిలో రాగానే ఎంఈవోల ఆధ్వర్యంలో సంబంధిత పాఠశాలలకు అందజేస్తాం.
రాజు, డీఈవో మెదక్
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్
Read Latest Telangana News and National News