బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బందిపై మూకుమ్మడి దాడి
ABN , Publish Date - May 06 , 2026 | 09:39 AM
మల్కాజ్‌గిరిలోని ఓ రెస్టారెంట్‌లో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. బిల్లు కట్టమన్న రెస్టారెంట్ సిబ్బందిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. దీంతో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, మే 6: మల్కాజ్‌గిరి కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు హంగామా సృష్టించారు. రెస్టారెంట్‌లో బిల్లు కట్టమన్నందుకు యాజమాన్యం, సిబ్బందిపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రౌడీషీటర్ల దాడిలో రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ దుండగులు మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రధాన నిందితుల్లో ఏదుల ప్రసన్ రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి, వారి అనుచరులపై నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్తను(లలిత్) ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
వెలిగొండ ప్రాజెక్టును జగన్ నిర్లక్ష్యంగా వదిలేశారు.. మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest Telangana News And Telugu News