Share News

రెమిటెన్స్‌ల్లో భారత్‌ టాప్‌

ABN , Publish Date - May 06 , 2026 | 04:45 AM

రెమిటెన్స్‌ల రూపంలో అత్యధిక నిధులు అందుకున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. విదేశాల్లో స్థిరపడినవారు స్వదేశంలోని...

రెమిటెన్స్‌ల్లో భారత్‌ టాప్‌

2024లో రూ.13.07 లక్షల కోట్లు స్వదేశానికి పంపిన ప్రవాస భారతీయులు

ఐక్యరాజ్య సమితి: రెమిటెన్స్‌ల రూపంలో అత్యధిక నిధులు అందుకున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. విదేశాల్లో స్థిరపడినవారు స్వదేశంలోని తమ సంబంధీకులకు పంపే సొమ్మును రెమిటెన్స్‌ అంటారు. 2024లో ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఏకంగా 13,767 కోట్ల డాలర్ల (రూ.13.01 లక్షల కోట్లు) సొమ్మును స్వదేశంలోని తమవారికి రెమిటెన్స్‌ల రూపంలో పంపారు. అంతేకాదు, 10,000 కోట్ల డాలర్లకు పైగా రెమిటెన్స్‌లు అందుకున్న ఏకైక దేశం కూడా. మెక్సికో, ఫిలిప్పీన్స్‌, ఫ్రాన్స్‌ వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచాయి. ఐక్యరాజ్య సమితిలో వలసలకు సంబంధించిన ఏజెన్సీ ‘ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌’ (ఐఓఎం) తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

  • 2010 నుంచి భారత్‌ అత్యధిక రెమిటెన్స్‌లు అందుకుంటున్న దేశంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

  • 2024లో దక్షిణాసియాకు వచ్చిన రెమిటెన్స్‌లో అత్యధికంగా 11.8 శాతం వృద్ధి నమోదైంది. విదేశాలకు వలసపోయిన భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వాసులు స్వదేశానికి భారీగా సొమ్ము పంపడం ఇందుకు దోహదపడింది.

  • అగ్రరాజ్యం అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాల నుంచే అధిక శాతం రెమిటెన్స్‌లు లభించాయి.

విద్యార్థుల వలసలు

ఆసియా నుంచే అధికం

విదేశాల్లో చదువుతున్న వారిలో ఆసియా విద్యార్థులే అధికం. 2022లో 10 లక్షలకు పైగా చైనా విద్యార్థులు ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లారు. భారత్‌ నుంచి 6.20 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఉజ్బెకిస్థాన్‌ (1.50 లక్షలు), వియత్నాం(1.34 లక్షలు), జర్మనీ (1.26 లక్షల మంది) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్‌, నైజీరియా, సిరియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌, నేపాల్‌ నుంచి 95,000-1.15 లక్షల స్థాయిలో విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లారు. కాగా, వలస విద్యార్థుల్లో సగానికి పైగా యూరప్‌, ఉత్తర అమెరికాలోనే చదువుకుంటున్నారు.

2024లో రెమిటెన్స్‌ల ప్రవాహం ఏ దేశం నుంచి ఎంత..?

దేశం కోట్ల డాలర్లు

అమెరికా 10,000

సౌదీ అరేబియా 4,600

స్విట్జర్లాండ్‌ 4,000

జర్మనీ 2,400

భారత్‌కు రెమిటెన్స్‌లు

ఏడాది కోట్ల డాలర్లు

2010 5,348

2015 6,891

2020 8,315

2024 13,767

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 04:46 AM