Share News

లేక లేక ఓ లేఖ..

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:43 PM

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌, కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచే స్తున్న ఏడుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

లేక లేక ఓ లేఖ..
KU Professors

  • కేయూలో వివాదానికి దారి తీసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల తీరు

  • యూజీసీకి నేరుగా రాయడంపై రిజిస్ట్రార్‌ సీరియస్‌

  • ఏడుగురికి షోకాజ్‌ నోటీసుల జారీ

వరంగల్: కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌, కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న ఏడుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. యూజీసీ జీవో 14ను అనుసరించి నేరుగా తమకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించాలని వారు యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ సెక్రటరీకి లేఖలు రాశారు. ఈ విషయం తమ దృష్టిలో లేకుండా యూజీసీకి నేరుగా ఎందుకు లేఖ రాశారో చెప్పాలని షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది.


ఇటీవల యూజీసీ వెలువరించిన జీవో నెంబరు 15 వల్ల తమ ప్రమోషన్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధ్యాపకులు యూజీసీకి పంపిన లేఖలో విన్నవించారు. గతంలో పనిచేసిన వీసీ, రిజిస్ట్రార్లు జీవో నెంబరు 14ను అనుసరించి కొందరికి ప్రొఫెసర్లగా ప్రమోషన్లు కల్పించారని, తమకు కూడా అలాగే అవకాశం కల్పించాలని వారు తమ లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది. పీహెచ్‌డీ విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించి, కనీసం ఒక్కరికి థీసిస్‌ అ వార్డు చేయించాలని, అప్పుడే ప్రొఫెసర్‌ ప్రమోషన్‌కు అర్హులని కొత్తగా వెలువడిన జీవో 15లో నిబంధనలు నిర్దేశించారు.


ku1.2.jpgఅయితే అనేక రకాల సమస్యల వల్ల పీహెచ్‌డీల అడ్మి షన్లు, థీసిస్‌ సమర్పణ ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్‌ అయ్యేందుకు తగినంత సర్వీస్‌ పూర్తి చేసుకున్నప్పటికీ ప్రమోషన్‌ అలస్యం అవుతోందని అధ్యాపకులు తాము యూజీసీకి పంపిన లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది.


అయితే యూనివర్సిటీ అధికారుల దృష్టిలో లేకుండా నేరుగా యూ జీసీకి లేఖలు రాయడంపై సీరియస్‌ అయిన వర్సిటీ ఉన్నతాధికా రులు...ఏడుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ మేరకు యూజీసీకి నేరుగా లేఖలు రాయడం వర్సిటీ నిబంధనలకు విరుద్దమని, సంబంధిత అధికారుల ద్వారానే లేఖలు పంపాలని నిబంధనలు ఉన్నాయని అధికారులు ఉటంకిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆర్టీసీలో ఎన్నికల జోష్..

నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 02:15 PM