క్యాంపస్ టూ కార్పొరేట్ !
ABN , Publish Date - Nov 13 , 2026 | 08:02 AM
జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు తమ డిగ్రీ పట్టా చేతికి వచ్చేలోగా ఉద్యోగావకావశాలు లభించేలా నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జయలక్ష్మి తెలిపారు.
జేఎన్టీయూ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
హైదరాబాద్ సిటీ: జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు తమ డిగ్రీ పట్టా చేతికి వచ్చేలోగా ఉద్యోగావకావశాలు లభించేలా నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జయలక్ష్మి తెలిపారు. ‘క్యాంపస్ టూ కార్పొరేట్’ కార్యక్రమం కింద గతేడాది మంథనిలోని జేఎన్టీయూ కళాశాల విద్యార్థులకు టీసీఎస్ అయాన్ ద్వారా అందించిన శిక్షణతో వారికి మెరుగైన ప్లేస్‌మెంట్స్ లభించాయని చెప్పారు. దీంతో ఈ ఏడాది నుంచి సుల్తాన్పూర్, జగిత్యాల, వనపర్తి, పాలేరు, మహబూబాబాద్, సిరిసిల్ల జేఎన్టీయూ కాలేజీల విద్యార్థులకు కూడా టీసీఎస్ అయాన్ శిక్షణను విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు.
అలాగే ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాభావ పరిస్థితులు ఉన్నందున అనుబంధ కళాశాలల్లో, హాస్టళ్లల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్స్‌కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ జయలక్ష్మి సూచించారు. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే కరోనా సమయంలో మాదిరిగా ఆన్లైన్ బోధనకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News