తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Nov 13 , 2026 | 06:43 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా, క్యూలైన్ బాటగంగమ్మ ఆలయం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.3.90 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 73,392
తలనీలాలు సమర్పించినవారు: 33,288
ఈ వార్తలు కూడా చదవండి:
పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు జపాన్ ఆసక్తి
పర్యాటక రంగంలో పెట్టుబడులు: దుర్గేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News