తెలంగాణ గజగజ
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:56 AM
చలికి తెలంగాణ గజగజ వణికిపోతోంది.
రాష్ట్రంలో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో11.3 డిగ్రీలు
రంగారెడ్డి జిల్లాలో 11.4 డిగ్రీలు
ఉదయం వేళ పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు
సాయంత్రానికే నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
రాత్రిళ్లు బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి), కోహీర్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): చలికి తెలంగాణ గజగజ వణికిపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ ప్రాంతంలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. జిల్లాలోని ఝరాసంగం, న్యాల్కల్‌లో 11.5, సత్వార్‌లో 11.6, అల్గోల్‌లో 11.8 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 25 గ్రామాల్లో 15 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ చలి విజృంభించింది. మెదక్ జిల్లాలోని 13 గ్రామాల్లో, సిద్దిపేట జిల్లాలోని 20 గ్రామాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళ పొగమంచుతో వాహనదారులు, పనులకు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు.
రంగారెడ్డి జిల్లాలో చలిగాలుల తీవ్రత
రంగారెడ్డి జిల్లాలో 11.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లాలో 11.7 డిగ్రీలు, మేడ్చల్ జిల్లాలో 13.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలలోపు రికార్డయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఉండడంతో సాయంత్రానికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాత్రిళ్లు జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు