మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 09:23 PM
రాష్ట్రంలోని మూడు టిమ్స్ (TIMS)కు ఒకే రిక్రూట్‌మెంట్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలు ఈ మూడు టిమ్స్ మధ్య జరిగేలా ఉండాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్12: రాష్ట్రంలోని మూడు టిమ్స్ (TIMS)కు ఒకే రిక్రూట్‌మెంట్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలు ఈ మూడు టిమ్స్ మధ్య జరిగేలా ఉండాలని సూచించారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం రేవంత రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హౌస్ కీపింగ్ పూర్తిగా అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వాలని స్పష్టం చేశారు. డాక్టర్స్ పూర్తిగా వైద్యంపైనే దృష్టి సారించేలా చూడాలని పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్వహణ అత్యంత కీలకమని గుర్తు చేశారు. నిమ్స్‌లో బెడ్స్ ఖాళీ లేకుంటే.. రోగులను సనత్ నగర్ టిమ్స్‌కు తరలించాలని ఆదేశించారు. ఈ క్రమంలో నిమ్స్, టిమ్స్ మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.
సనత్ నగర్ టిమ్స్‌లో డాక్టర్స్ నియామకం పూర్తయ్యే వరకు బయట నుంచి డాక్టర్స్‌ను నియమించుకోవాలని సూచించారు. టిమ్స్, ప్రభుత్వ వైద్య కళాశాలలకి అదనంగా కావాల్సిన నిధులని మంజూరు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. జూన్ 2వ తేదీన నాటికి అన్ని టిమ్స్ అందుబాటులోకి రావాల్సిందేని అధికారులకు ఆదేశించారు. డిసెంబర్ నాటికి ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం పూర్తి కావాలని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు విషయంలో సాంకేతికతను వినియోగించాల్సి ఉందని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ , రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి ఇలంబర్తి ,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ముషర్రఫ్ అలీ ఫారూఖీ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ , రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEO హనుమంత్ కొండిబా, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎన్. వాణి , నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, TIMS సనత్‌నగర్ డైరెక్టర్ డాక్టర్ నరేందర్, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు
నాగుల చవితి ఎప్పుడూ .. ఆ రోజు ఏం చేయాలి
For More AP News And Telugu News