నాగుల చవితి ఎప్పుడూ .. ఆ రోజు ఏం చేయాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:09 PM
కార్తీక మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో వచ్చే తొలి పండుగ నాగుల చవితి. ఈ ఏడాది నాగుల చవితి శుక్రవారం (13-11-2026) వచ్చింది. చవితి తిథి ఆ రోజు సాయంత్రం వరకు ఉంటుంది.
కార్తీక మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో వచ్చే తొలి పండుగ నాగుల చవితి. ఈ ఏడాది నాగుల చవితి శుక్రవారం (13-11-2026) వచ్చింది. చవితి తిథి ఆ రోజు సాయంత్రం వరకు ఉంటుంది. గురువారం (12-11-2026) మధ్యాహ్నం 3.39 గంటలకు చవితి తిథి వస్తుంది. ఈ తిథి శుక్రవారం రాత్రి 5.46 గంటల వరకు ఉంటుంది. అయితే సూర్యోదయం వేళ.. ఏ తిథి ఉంటే.. ఆ రోజే పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాగుల చవితిని భక్తులు జరుపుకోనున్నారు. నాగుల చవితి మరునాడు నాగ పంచమి.
ఈ పండుగ శనివారం (14-11-2026) వచ్చింది. ఈ రోజు కూడా శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తిశ్రద్ధలతో భక్తులతో ఆరాధిస్తారు. (ప్రతి ఏటా నాగ పంచమి రెండు సార్లు వస్తుంది. ఒకటి శ్రావణ మాసంలో వస్తే.. మరొకటి కార్తీక మాసంలో వస్తుంది). నాగ పంచమి వెళ్లిన మరునాడు (ఆదివారం) షష్ఠి వస్తుంది. వరుసగా ఈ మూడు రోజులు శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తులు పూజిస్తారు.
ఈ రోజుల్లో నాగుల పుట్టలో భక్తులు పాలు పోస్తారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆ యా దేవాలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. ఆయా రోజుల్లో ఏపీలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రముఖ పుణ్య క్షేత్రాలు.. మోపిదేవి (మచిలీపట్నం సమీపంలో..), సింగరాయపాలెం (గుడివాడ సమీపంలో..) దేవాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి.
ఈ రోజు ఏం చేయాలి..
స్వామి వారి పుట్టలుంటాయి. అలాగే పలు దేవాలయాల్లో నాగ ప్రతిమలు ఉంటాయి. పుట్టల్లో పాలు పోయ్యాలి. ఇక దేవాలయాల్లోని రావి, వేప చెట్లు కింద జంట నాగ ప్రతిమలను ఆవు పాలతో అభిషేకించాలి. పసుపు, కుంకుమతో పూజించాలి. స్వామి వారికి ఎర్రని పూలు సమర్పించాలి. చిలిమిడి, పెసరపప్పు స్వామి వారికి నైవేద్యంగా పెట్టాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల సర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సుబ్రహ్మణ్యాష్టకంతోపాటు..
నాగుల చవితి, పంచమి, షష్ఠి రోజుల్లో సుబ్రహ్మణ్యాష్టకం 8 చదవాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా చదవాలి. వీటిని ప్రతి చదవడం వల్ల భక్తులు మంచి ఫలితాలు పొందుతారని శాస్త్ర పండితులు చెబుతారు.
ఈ దోషాలు తొలుగుతాయి..
ఇక నాగుల చవితి పండగకు సంబంధించి పురాణ కథలు చాలనే ఉన్నాయి. ముఖ్యంగా నాగ దేవతను పూజించడం ద్వారా సర్ప దోషం తొలుగుతుందని పండితులు చెబుతారు.
శుక్ల పక్షం చవితి తిథి రోజు నాగ దేవతను ఆరాధించడం వల్ల.. సర్ప దోష నివారణ కలుగుతుంది.
సంతానం లేని వారు.. ఈ రోజు సర్ప దేవతలను పూజించాలి. తద్వారా సంతాన భాగ్యం కలుగుతుంది.
పల్లె ప్రాంతాల్లో రైతులు.. తమ పంటలను రక్షించుకునేందుకు నాగ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని.. అలాగే వ్యవసాయ భూమి సారవంతం కావాలని వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తారు. దీంతో పంటలు అధిక దిగుబడికి, పశు పక్ష్యాదులకు నాగదేవత రక్షణనిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. అలాగే సర్ప దోషంతోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన దోషాలు కూడా తొలుకుతాయని భక్తులు భావిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. క్యూలైన్ శిలాతోరణం వరకు..
For More Devotional News And Telugu News