Share News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్లు శ్రీలీల, శ్రీ గౌరీ ప్రియ

ABN , Publish Date - Nov 13 , 2026 | 07:50 AM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ హీరోయిన్లు శ్రీలీల, శ్రీ గౌరీ ప్రియ దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్లు శ్రీలీల, శ్రీ గౌరీ ప్రియ

తిరుమల, నవంబర్ 13: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ హీరోయిన్లు శ్రీలీల, శ్రీ గౌరీ ప్రియ దర్శించుకున్నారు. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయానికి వచ్చిన వీరికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Sreeleela2.jpg


అనంతరం భక్తిశ్రద్ధలతో సుప్రభాత సేవలో పాల్గొన్న హీరోయిన్లు.. శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. సినీ రంగంలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్లు స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. సినీ ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొనడం స్థానికంగా అభిమానుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. కాగా, వీరిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పలువురు భక్తులు ఆసక్తి కనబరిచారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేటి రాశి ఫలాలు.. 13-11-2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Updated Date - Nov 13 , 2026 | 07:52 AM