శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:40 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా, క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.08 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 68,495మంది
తలనీలాలు సమర్పించినవారి సంఖ్య: 26,977
ఈ వార్తలు కూడా చదవండి:
అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News