Share News

కలుషిత ఆహారం తిని 56 మంది విద్యార్థినులకు అస్వస్థత

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:03 AM

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని భైరవాన్‌తిప్ప కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 56 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

కలుషిత ఆహారం తిని 56 మంది విద్యార్థినులకు అస్వస్థత

  • అనంతపురం జిల్లా గుమ్మఘట్ట కేజీబీవీలో ఘటన

గుమ్మఘట్ట, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని భైరవాన్‌తిప్ప కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 56 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం పలువురు బాలికలు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డారు. సమాచారం అందుకున్న గుమ్మఘట్ట వైద్యాధికారులు గురువారం ఉదయాన్నే కేజీబీవీకి వెళ్లి చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం కొందరు కోలుకున్నారు. 15 మందిని గుమ్మఘట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 05:03 AM