Share News

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 08:21 PM

ఏపీలో అక్వాన్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు.

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
Cyclone Aqwan

అమరావతి, నవంబరు 17: అక్వాన్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. అమరావతిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం కనిపించవచ్చని తెలిపారు. నెల్లూరు నుంచి తుని మధ్య తుపాను తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 17 , 2026 | 08:55 PM