భక్తులకు ఉపశమనం కోసం....
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:15 PM
తిరుమలలోనూ వేసవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.రోజురోజుకూ ఉష్టోగ్రతలు పెరుగుతున్న క్రమంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
తిరుమల: తిరుమలలోనూ వేసవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.రోజురోజుకూ ఉష్టోగ్రతలు పెరుగుతున్న క్రమంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు ఎర్రటి ఎండలో ఆగచాట్లు పడుతున్నారు. అయితే కొంతైనా వేడి నుంచి ఉపశమనం కల్పించేలా టీటీడీ చర్యలకు పూనుకుంది. పలుచోట్ల కూల్ పెయింట్లు వేయడంతో పాటు రెడ్ కార్పెట్లను ఏర్పాటు చేసింది.
అక్కడక్కడా చలువ పందిళ్లు వేశారు. అయితే ఆలయ పరిసరాల్లో పాదరక్షలతో నడువకూడదనే నిబంధన ఉన్న క్రమంలో చాలామంది భక్తులు కాలే నేలపై నడుస్తూ అగచాట్లు పడుతుండటాన్ని గుర్తించిన టీటీడీ ప్రస్తుతం దఫాల వారీగా నీటితో నేలను చల్లబరుస్తోంది. భక్తులు అధికంగా నడిచే మార్గాల్లో నిరంతరాయంగా నీటిని చల్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వలస కార్మికులకు ఊరట.. 5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు
Read Latest Telangana News and National News