నెలకు రూ.40 వేల కోట్లు.. అదే జరిగితే ఇరాన్ జాక్‌పాట్ కొట్టినట్టే..
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:00 PM
తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని అమెరికాకు ఇరాన్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనలను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని అమెరికాకు ఇరాన్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనలను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ముడి చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే (Iran Hormuz authority).
హోర్ముజ్‌పై తమ హక్కులకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్లతో కూడిన ఒక కొత్త అజెండాను అమెరికా ముందు ఇరాన్ ఉంచింది. పౌర వినియోగ అణు కార్యక్రమాన్ని ఇరాన్ హక్కుగా గుర్తించడం, అన్ని ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయడం, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం మొదలైనవి ఉన్నాయి. అయితే వీటిల్లో హోర్ముజ్‌పై హక్కుల కోసం చేస్తున్న డిమాండే కీలకమైనది. ఎందుకంటే అది మంచి వ్యాపార నిర్ణయం (Strait of Hormuz toll revenue).
ప్రపంచ చమురు సరఫరాలో హోర్ముజ్‌ది కీలక పాత్ర. అత్యంత ఇరుకైన ప్రదేశంలో 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధిపై ఇరాన్, ఒమన్ భౌగోళిక నియంత్రణను కలిగి ఉన్నాయి. యుద్ధానికి ముందు, ప్రతిరోజూ 100 నుంచి 135 ఓడలు హోర్ముజ్ ద్వారా ప్రయాణించేవి. రోజుకు 20 నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకువెళ్లేవి. అందులో అధిక భాగం భారతదేశం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇతర ఆసియా దేశాలకు వెళ్లేది. హోర్ముజ్‌పై ఇరాన్‌కు అధికారాన్ని కట్టబెడితే ఆ దేశానికి గొప్ప ఆర్థిక లాభం చేకూరుతుంది ( Iran $4.5 billion income).
ఒక్కో ఓడ నుంచి కనీసం 1-1.5 మిలియన్ డాలర్లను టోల్ ఫీజుగా వసూలు చేసినా, కేవలం ముడి చమురు ట్యాంకర్ల ద్వారానే ఇరాన్‌కు నెలకు ఏకంగా 4.5 బిలియన్ డాలర్లు వస్తుంది (US Iran conflict). అంటే మన కరెన్సీలో దాదాపు 41,800 కోట్ల రూపాయలు. అందుకే హోర్ముజ్‌పై నియంత్రణ సాధించాలని ఇరాన్ నాయకులు పట్టుదలగా ఉన్నారు. అదే జరిగితే భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా హార్ముజ్ జలసంధి ఇప్పుడు కేవలం సముద్ర మార్గం కాదు .. ఇరాన్ చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆర్థిక ఆయుధం.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..