Share News

ఖమేనీ కోమాలో ఉన్నారా.. కీలక నిర్ణయాలలో ఆయన ప్రమేయం లేదా..

ABN , Publish Date - Apr 07 , 2026 | 01:00 PM

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజుల నుంచి కోమాలో ఉన్నారా? ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారా? ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏమీ లేదా?.. అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.

ఖమేనీ కోమాలో ఉన్నారా.. కీలక నిర్ణయాలలో ఆయన ప్రమేయం లేదా..
Mojtaba Khamenei unconscious

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజుల నుంచి కోమాలో ఉన్నారా? ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారా? ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏమీ లేదా?.. అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. మొజ్తాబా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నట్టు అమెరికా-ఇజ్రాయెల్ దేశాల నిఘా సంస్థలకు తెలుసని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మొజ్తాబా తీవ్ర అనారోగ్యంతో ఉన్నందువల్ల నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపింది (Mojtaba Khamenei unconscious).


అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుమారడు మొజ్తాబా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. సుప్రీం లీడర్ అయిన తర్వాత కూడా మొజ్తాబా ఎక్కడా కనిపించలేదు. మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ప్రాణాలు కూడా కోల్పోయి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఖమేనీని చికిత్స నిమిత్తం రష్యాలోని మాస్కోకు తరలించారని కూడా వార్తలు వచ్చాయి (Iran Supreme Leader health).


మొజ్తాబా ఖమేనీ ఇరాన్‌లోనే ఉన్నారని, బయటకు వెల్లడించలేని కారణాల వల్ల ఆయన బహిరంగంగా కనిపించడం లేదని రష్యా రాయబారి తెలిపారు (US Iran war news). కాగా, మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన ఈ వార్తలు ఇరాన్ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఇరాన్ ప్రభుత్వం లేదా అధికార వర్గాలు ఈ వార్తను అధికారికంగా ధ్రువీకరించలేదు. అందువల్ల ఇప్పటికి ఇవి కేవలం నివేదికల ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే.


ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్


పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 07 , 2026 | 01:03 PM