ట్రంప్ వెనక్కి తగ్గారా.. కెనడా విషయంలో మనసు మార్చుకున్నారా..
ABN , Publish Date - Apr 07 , 2026 | 10:49 AM
పొరుగు దేశమైన కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలపాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ఆ విషయాన్ని ఆయన కొన్నేళ్లుగా చెబుతున్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతూ వస్తున్నారు.
పొరుగు దేశమైన కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలపాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ఆ విషయాన్ని ఆయన కొన్నేళ్లుగా చెబుతున్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతూ వస్తున్నారు. తన వ్యాఖ్యల పట్ల కెనడా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. అయితే తాజాగా ఆయన ఆ ఆలోచన నుంచి కాస్త వెనక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చే ఆలోచన సాధ్యం కాదని ఆయన వ్యక్తిగతంగా అంగీకరించినట్లు సమాచారం (Trump Canada 51st state).
ప్రముఖ రచయిత రాబర్ట్ హార్డ్‌మెన్‌తో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారట. కెనడాకు ఉన్న బలమైన జాతీయ గుర్తింపు, దాదాపు 200 ఏళ్ల చరిత్ర కారణంగా ఆ దేశాన్ని అమెరికాలో కలపడం కష్టమని ట్రంప్ పేర్కొన్నారని సమాచారం. ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తన పాత ఆలోచనలను సమీక్షించుకుంటున్నట్టు కనిపిస్తోంది (US Canada relations).
కాగా, కెనడాను అమెరికాలో కలపడం అక్కడి ప్రజలకు ప్రయోజనకరమని ఇంతకు ముందు ట్రంప్ చెప్పారు (North America politics). ఆర్థికంగా, భద్రత పరంగా ఇది కెనడా ప్రజలకు మంచి చేస్తుందని ఆయన వాదించారు. అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దీంతో అమెరికాలో కెనడా విలీనం అంశం ఇకపై రాజకీయ చర్చల్లో పెద్దగా ప్రాధాన్యం పొందకపోవచ్చు.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..