పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Apr 07 , 2026 | 09:41 AM
పనామా కాలువ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పసిఫిక్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న 'బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్' సమీపంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్‌లో మొదలైన మంటలు ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీశాయి.
పనామా కాలువ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పసిఫిక్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న 'బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్' సమీపంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్‌లో మొదలైన మంటలు ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీశాయి. పేలుడు సమయంలో భారీగా మంటలు వ్యాపించడం వీడియోల్లో కనిపించింది (Panama Canal explosion).
ఈ ప్రమాద ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు సాధారణ పౌరులు, ఇద్దరు ఫైర్ ఫైటర్లు ఉన్నారు. మరో వ్యక్తి అదృశ్యమయ్యాడు. వంతెనపై వాహనాలు ప్రయాణిస్తుండగా పక్కన ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడం, అక్కడి నుంచి చాలా మంది పారిపోవడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపించింది. పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరిన్ని పేలుళ్లు జరగకుండా సమీపంలోని ఇంధన ట్యాంకులను చల్లబరచే చర్యలు చేపట్టారు (fuel tanker blast Panama).
పనామా కాలువ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటి (Bridge of the Americas fire). ఈ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం చూపుతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కాలువ కార్యకలాపాలపై ఈ ఘటన వల్ల పెద్దగా ప్రభావం లేదని అధికారులు చెప్పారు. పేలుడుకు అసలు కారణం ఏమిటి అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..