Share News

ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:05 PM

తాను పని చేసిన ఆసుపత్రిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఓ మహిళా డాక్టర్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ దారుణాలు తట్టుకోలేక తాను రాజీనామా చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: తాను పని చేసిన ఆసుపత్రిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఓ మహిళా డాక్టర్ ఆరోపించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందో చెబుతూ ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొంతకాలం క్రితం తాను ఆ ఆసుపత్రిలో జనరల్ ఫిజీషియన్‌గా చేరానని ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ చేరిన కొన్ని రోజులకే ఆసుపత్రిలో జరుగుతున్న దారుణాలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు.

ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్‌లో వీలైనంత మందిని అవసరం ఉన్నా లేకున్నా ఐసీయూకు తరలిస్తున్నారని చెప్పారు. ఆ ఆసుపత్రిలో ఒక జనరల్ ఫిజీషియన్ ఉన్నారని జనాలకు చెప్పుకోవడానికే తనకు జాబ్ ఇచ్చారని ఆమె తెలిపారు. ఆసుపత్రిని ఓ గైనకాలజిస్టు నిర్వహిస్తున్నారని, పేషెంట్‌ విషయాల్లో నిర్ణయాలన్నీ ఆమెవేనని తెలిపారు. ఆ గైనకాలజిస్టు దాదాపుగా అందరు పేషెంట్లను ఐసీయూలో పెట్టేవారని అన్నారు. వీలైనన్ని రోజుల పాటు ఐసీయూలో పేషెంట్‌లను పెట్టేందుకు ప్రయత్నించే వారని అన్నారు.


ఈ అనైతిక చర్యలు, స్కామ్‌లు చూసి తట్టుకోలేక తాను రాజీనామా చేశానని వైద్యురాలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేకపోయినప్పటికీ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇలాంటివి దేశంలో సర్వసాధారణంగా మారిపోయాయని అనేక మంది విచారం వ్యక్తం చేశారు. నైతికతకు కట్టుబడి జాబ్‌ను వదులుకున్నందుకు జనరల్ ఫిజీషియన్‌ను పలువురు ప్రశంసించారు.


ఈ వార్తలనూ చదవండి:

నాకు ఆఫీసులో పనే ఉండదు.. టెకీ పోస్టు వైరల్

దురంధర్-2.. దావూద్ ఇబ్రహీం, సల్మాన్ డకైత్‌ల గ్యాంగ్ వార్ చరిత్ర ఇదీ

Updated Date - Apr 06 , 2026 | 03:12 PM