తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 07 , 2026 | 06:19 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 7న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. (Gold prices).
ఈ రోజు (ఏప్రిల్ 7న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,50,650 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,090 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,50,080కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,38,240కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం 2.6 లక్షల రూపాయల చేరువలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,50,650, రూ.1,38,090
విజయవాడలో రూ.1,50,650, రూ.1,38,090
ఢిల్లీలో రూ.1,50,080, రూ.1,38,240
ముంబైలో రూ.1,50,650, రూ.1,38,090
వడోదరలో రూ.1,50,700, రూ.1,38,140
కోల్‌కతాలో రూ.1,50,650, రూ.1,38,090
చెన్నైలో రూ.1,52,630, రూ.1,39,910
బెంగళూరులో రూ.1,50,650, రూ.1,38,090
కేరళలో రూ.1,50,650, రూ.1,38,090
పుణెలో రూ.1,50,650, రూ.1,38,090
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,60,100
విజయవాడలో రూ.2,60,100
ఢిల్లీలో రూ.2,49,900
చెన్నైలో రూ.2,60,100
కోల్‌కతాలో రూ.2,49,900
కేరళలో రూ.2,60,100
ముంబైలో రూ.2,49,900
బెంగళూరులో రూ.2,49,900
వడోదరలో రూ.2,49,900
అహ్మదాబాద్‌లో రూ.2,49,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్
నాకు ఆఫీసులో పనే ఉండదు.. టెకీ పోస్టు వైరల్