‘రైతు స్నేహితుడు మోదీ’
ABN , Publish Date - Apr 07 , 2026 | 01:57 PM
బీజేపీ అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ‘రైతు స్నేహితుడు మోదీ’ నినాదంతో సరికొత్త ప్రచారం చేపట్టనున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి వంద మందిని నియమించారు.
బీజేపీ సరికొత్త ప్రచారం
చెన్నై: బీజేపీ అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ‘రైతు స్నేహితుడు మోదీ’ నినాదంతో సరికొత్త ప్రచారం చేపట్టనున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి వంద మందిని నియమించారు. ఈ విషయమై కిసాన్ మోర్చా అధ్యక్షుడు జీకే నాగరాజ్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, రైతులకు ప్రతి ఏడాది రూ.6వేలు మూడు విడతలుగా అందిస్తుందన్నారు.
అలాగే, పంట బీమా పథకం కూడా రైతులను ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. ఇలాంటి పథకాలతో రాష్ట్రంలో పలు లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారని తెలిపారు. ఈ కారణంగా ‘రైతు స్నేహితుడు మోదీ’ అనే నినాదంతో తమ విభాగం ఆధ్వర్యంలో బీజేపీ పోటీచేస్తున్న 27 స్థానాల్లో ప్రచారం చేపట్టనున్నట్లు నాగరాజ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వలస కార్మికులకు ఊరట.. 5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు
Read Latest Telangana News and National News