Share News

విజయ్‌ నామినేషన్‌లో లోపాలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:06 AM

పెరంబూర్‌ నియోజకవర్గంలో సవరించిన ప్రమాణ పత్రాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ తరఫున దాఖలుచేశారు.

విజయ్‌ నామినేషన్‌లో లోపాలు

  • మూడోసారి ప్రమాణ పత్రం సవరించి దాఖలు

చెన్నై: పెరంబూర్‌ నియోజకవర్గంలో సవరించిన ప్రమాణ పత్రాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ తరఫున దాఖలుచేశారు. మొత్తం మీద మూడో సారిగా ఆయన నామినేషన్‌ పత్రంలో మార్పులు చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నియోకవర్గాల నుంచి పోటీచేయనున్నారు. అందుకోసం రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. రెండు నామినేషన్లలో వేర్వేరు సమాచారం ఉంది. పెరంబూర్‌ నియోజకవర్గంలో వేసిన నామినేషన్‌లో, తనపై ఎలాంటి నేరాలు లేవని పేర్కొనగా, తిరుచ్చి ఈస్ట్‌ నామినేషన్‌లో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.


అలాగే, రెండు నామినేషన్లలో విజయ్‌ వయస్సు వేర్వేరుగా ఉండడంతో, నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, టీవీకే న్యాయవాదుల తరఫున పెరంబూర్‌ ఎన్నికల అధికారులకు ఇప్పటికే దాఖలుచేసిన ప్రమాణ పత్రంలోని వివరాలు సవరించేందుకు అవకాశం కల్పించాలని గత నెల 30వ తేది వినతిపత్రం సమర్పించారు.


nani1.2.jpgఅనంతరం పత్రంలో వివరాలు సవరించి ఈ నెల 4వ తేది విజయ్‌ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి శివ, ఎన్నికల అధికారులకు సమర్పించారు. విజయ్‌పై ఉన్న కేసుల వివరాలు సవరించిన ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో, నామినేషన్‌ దాఖలుకు చివరి రోజైన సోమవారంఎన్నికల అధికారికి మూడో కొత్త ప్రమాణ పత్రాన్ని విజయ్‌ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి శివ అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 07 , 2026 | 11:06 AM