23న వేతనంతో కూడిన సెలవు
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:59 AM
కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నికల పోలిం గ్ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
చెన్నై: కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నికల పోలిం గ్ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరుగనుంది. ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ అయ్యేలా అవగాహన కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలో, కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా,
ఈ నెల 23వ తేది వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. వేతనంతో కూడిన సెలవు ఇవ్వని కర్మాగారాలు, దుకాణాలపై కార్మికులు 7904646090 (ఎల్.రమేష్, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్), అసిస్టెంట్ కమిషనర్లు ఎల్.శోభన (72990 07334), పి.పళని (7904802429, ఎస్.శివకుమార్ (9043555123)లకు ఫిర్యాదు చేయాలని లేబర్ కమిషనర్ తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వలస కార్మికులకు ఊరట.. 5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు
Read Latest Telangana News and National News