Share News

వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్‌’ పార్టీ ఉండదు

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:32 AM

వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్‌’ పార్టీ ఉండదని కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు. కారైక్కుడి కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా సోమవారం పలు ప్రాంతాల్లో కార్తీ చిదంబరం ప్రచారం చేశారు.

వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్‌’ పార్టీ ఉండదు

  • కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం

చెన్నై: వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్‌’ పార్టీ ఉండదని కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు. కారైక్కుడి కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా సోమవారం పలు ప్రాంతాల్లో కార్తీ చిదంబరం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీటీవీ దినకరన్‌ నేతృత్వంలో ఏఎంఎంకే పలు ఎన్నికల్లో పోటీచేసి పరాజయం చవిచూసిందన్నారు. బీజేపీ కూటమిలో ఏ పార్టీ చేరినా, ఆ పార్టీని బీజేపీ బాగా కొరికి మింగేస్తుందన్నారు. దినకరన్‌ తనకు మంచి మిత్రుడని, అందుకోసమే ఆయన కు సలహా ఇస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కుక్కర్‌ కమలంగా మారుతుందన్నారు.


nani1.3.jpgఅన్నాడీఎంకే గతంలా లేదన్నారు. గతంలో కూటమిపై మాట్లాడాలంటే ఢిల్లీ నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం లేదా జయలలిత ఇంటికి వచ్చి చర్చలు జరిపేవారని గుర్తు చేశారు.. ప్రస్తుతం అన్నాడీఎంకేలో విబేధాల కారణంగా కూటమిపై ఢిల్లీలోనే చర్చలు జరుగుతున్నాయన్నారు. అలాంటి పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కారైక్కాల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని కార్తీ చిదంబరం విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విజయ్‌ నామినేషన్‌లో లోపాలు

వలస కార్మికులకు ఊరట.. 5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 07 , 2026 | 11:32 AM