తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:10 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఇక, శని, ఆదివారాల్లో 1.58 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.7.35 కోట్లు లభించింది. ఈ రెండురోజుల్లో 52 వేల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
135 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News