పోస్టుల సృష్టి, అప్‌గ్రెడేషన్ వాయిదా
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:26 AM
రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ప్రక్రియ ముగిసేవరకు ప్రభుత్వ శాఖల్లో కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్‌గ్రెడేషన్‌ను వాయిదా వేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ప్రక్రియ ముగిసేవరకు ప్రభుత్వ శాఖల్లో కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్‌గ్రెడేషన్‌ను వాయిదా వేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ కేటగిరీ ఉద్యోగులకైనా గెజిటెడ్ హోదా కల్పించే ప్రతిపాదనలను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్త పోస్టుల కల్పన, అప్‌గ్రెడేషన్, గెజిటెడ్ హోదాల కోసం ఆర్థిక శాఖకు పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే, పీఆర్సీ ప్రక్రియ కొనసాగుతున్నందున సిబ్బంది విషయంలో ఇలాంటి మార్పులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి: