Share News

135 మంది వైద్యులకు షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:55 AM

రోగులకు సేవలు అందించడంలో వెనుకబడిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్‌సీ)కు చెందిన 135 మంది వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు...

135 మంది వైద్యులకు షోకాజ్‌ నోటీసులు

  • యూపీహెచ్‌సీల్లో నిర్లక్ష్యంగా వైద్య సేవలు

  • ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా పనితీరు అంచనా

  • సేవల్లో మొదటిస్థానంలో నిలిచిన పల్నాడు

అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రోగులకు సేవలు అందించడంలో వెనుకబడిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్‌సీ)కు చెందిన 135 మంది వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు డీహెచ్‌ డా. ఆర్‌.వెంకటరమణ తెలిపారు. జూలై నుంచి నవంబరు వరకూ ఐవీఆర్‌ఎస్‌ ద్వారా రోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా పనితీరును అంచనా వేశామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా చేపట్టిన సర్వేలో యూపీహెచ్‌సీల్లోని వైద్య సేవల పనితీరు మెరుగుపరచడంలో పల్నాడు జిల్లా 81.6 శాతంతో మొదటిస్థానంలో నిలిచిందన్నారు. 81.5 శాతంతో పోలవరం, 80.7 శాతంతో నెల్లూరు, 78.3 శాతంతో తిరుపతి, 77.5 శాతంతో కృష్ణా జిల్లాలు వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచాయని చెప్పారు. గడచిన ఆరు నెలల పనితీరు ఆధారంగా వెనుకబడిన జిల్లాల్లో కర్నూలు 69.5 శాతం, అనంతపురం 69.8 శాతం, ఎన్టీఆర్‌ 70.9 శాతం అనకాపల్లి 71.5 శాతం, మర్కాపురం 71.8 శాతంతో ఉన్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 05:56 AM