పుష్కర స్నానం.. సకల పాప హరణం
ABN , Publish Date - May 27 , 2026 | 01:55 PM
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు ఆరో రోజుకు చేరాయి.
ఘనంగా కొనసాగుతున్న సరస్వతి అంత్యపుష్కరాలు
పుణ్య స్నానాల కోసం ఉత్సాహంగా తరలివస్తున్న భక్తులు
కాళేశ్వరం: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు ఆరో రోజుకు చేరాయి. పుష్కరఘాట్‌ల వద్ద తెల్లవారు జాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరించారు. వేద మం త్రోచ్ఛరణలు, హారతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాళేశ్వర క్షేత్రం మార్మోగుతోంది. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి హాజరై పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించి, పుష్కరాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గురిం చి వివరించారు.
అలాగే దేవాదాయ కమిషనర్ హనుమంతరావు హాజరై పుష్కర స్నానం ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పుష్కరాల సందర్భంగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో సకల ఐశ్వర్య ప్రాసస్థ్యం దుర్గ సూక్త హోమం అత్యంత వైభవంగా జరిగింది. పండితులు వేద మంత్రాల నడుమ హోమ క్రతువులను నిర్వహిం చగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ఈ పుష్కర పుణ్య స్నానాలకు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రయాణికులపై ఆర్ధిక భారం
ఆర్టీసీ సంస్థ సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయితే.. రెగ్యులర్ బస్సులు తగ్గించి ప్రత్యేక బస్సులు నడపడంతో ఆ ప్రాంతం వైపు వెళ్లే ఇతర ప్రయాణికులపై ఆర్థిక భారం పడుతోంది. భూపాలపల్లి నుంచి కాళేశ్వరానికి టికెట్ ధర రూ.110 కాగా ప్రత్యేక బస్సు పేరుతో రూ.130 వసూలు చేస్తున్నారు. అలాగే కాటారం నుంచి కాళేశ్వరానికి ప్రయాణించిన వారికి రెగ్యులర్ రేటుపై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు.
సెల్ఫీలతో సందడి
పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి సెట్టింగ్‌ను చూసి మురిసిపో యిన భక్తులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. సరస్వతి పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత, శివుని విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే పిల్లలు ఆడు కోవడానికి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లాపాప లతో వచ్చిన భక్తులు ఆహ్లాదాన్ని పొందుతున్నారు. అలాగే అంత్య పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.
నిలిచిపోయిన కాలసర్పదోశ పూజలు
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం లో మంగళ, గురువారాల్లో కాల సర్ప దోశ పూజలు నిర్వహిం చడం ఆనవాయితీ. పుష్కరాల నేపథ్యంలో ఆ పూజలను తాత్కలికంగా నిలిపివేశారు. దీంతో కాలసర్పదోశ పూజలు చేయించుకోవడానికి వచ్చిన భక్తులు కొంత నిరాశకు గురయ్యారు. అయిన్పటికీ పుష్కర స్నానం ఆచరించి ఆలయంలో ముక్తీశ్వరుడిని దర్శించుకుని వెళ్లారు.
శివపార్వతుల కల్యాణం
శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రతి రోజూ శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వ హించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొని పునీతులవుతారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కల్యాణాన్ని నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందిస్తున్నా రు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తుల పాపాలు తొలిగి తమ జీవితాన్ని ఆనందమయం అవుతా యని నమ్మకం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్ఐఆర్ ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News