Share News

రెండురోజులు భారీవర్ష సూచన

ABN , Publish Date - May 27 , 2026 | 12:32 PM

పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.

రెండురోజులు భారీవర్ష సూచన
Heavy Rain Alert

చెన్నై: పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. దాని కారణంగా, రానున్న 48గంటల్లో కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌ జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, నీలగిరి, ఈరోడ్‌, సేలం, తేని, దిండుగల్‌ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో బుధవారం నుంచి 30వ తేదీ వరకు ఉష్ణోగత్రలు సాధారణం కన్నా 2-3డిగ్రీలవరకు పెరిగేఅవకాశముంది.


nani1.2.jpgరాజధాని నగరం చెన్నైలో రాబోయే 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ గరిష్ట ఉష్ణోగత్ర 40-41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29-30 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశముంది. అలాగే, రాత్రి వేళ వేడిగాలులతో ఉక్కపోత వాతావరణం నెలకొనే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎస్ఐఆర్ ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 27 , 2026 | 12:32 PM