Share News

WWEని తాకిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. వీడియో వైరల్

ABN , Publish Date - May 27 , 2026 | 12:11 PM

టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మామూలుగా లేదు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(WWE) స్టార్ డ్రూ మెక్‌ఇంటైర్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

WWEని తాకిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. వీడియో వైరల్
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మామూలుగా లేదు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో వైభవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఈ కుర్రాడికి విదేశాల్లోని సెలబ్రిటీస్ కూడా ఫ్యాన్స్ అవుతున్నారు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(WWE) స్టార్ డ్రూ మెక్‌ఇంటైర్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


డ్రూ మెక్‌ఇంటైర్.. వైభవ్ జెర్సీని ధరించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకి ‘చూజెన్ వన్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా స్పందించాడు. ‘ఓ మై గాడ్..’ అంటూ పోస్ట్‌కు కామెంట్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ అధికారిక ఫ్రాంచైజీ కూడా డ్రూ పోస్ట్‌పై స్పందించింది. వైభవ్ ఆటతీరుకు ఇతర స్పోర్ట్స్‌కు చెందిన వారు కూడా ఫ్యాన్స్ అవుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ కీలక ఆటగాడిగా మారాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 583 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. కాగా నేడు ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్థాన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో నెగ్గిన జట్టు క్వాలిఫయర్ 2కి అర్హత సాధిస్తుంది. ఓడి టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఈ కీలక పోరు నేపథ్యంలో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: పాటీదార్ పవర్ షో.. ప్రపంచ రికార్డు బద్దలు!

ఐపీఎల్ 2026: ఆర్సీబీ విజయ రహస్యాన్ని చెప్పేసిన భువీ!

Updated Date - May 27 , 2026 | 12:15 PM