Share News

ఎస్ఐఆర్ ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - May 27 , 2026 | 11:49 AM

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ సవరణ ప్రక్రియకు భిన్నంగా ఉందన్న కారణంతో ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎస్ఐఆర్ ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్
SIR

ఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ సవరణ ప్రక్రియకు భిన్నంగా ఉందన్న కారణంతో ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్‌లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్‌ను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.


విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయని పేర్కొంది. ‘ఎస్ఐఆర్ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యానికి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలనే రాజ్యాంగ లక్ష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని భావిస్తున్నాం. ఈ ప్రక్రియ ప్రస్తుత ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడం లేదు. అంతేకాకుండా ఆర్టికల్ 324 కింద రాజ్యాంగ ఆదేశానికి జీవం పోస్తోంది. ఎన్నికల కమిషన్ తన చట్టబద్ధమైన అధికారాలను అతిక్రమించి వ్యవహరించిందని చెప్పలేం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


కాగా, మే 30 నుంచి 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో విడత, చివరి దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ప్రతిపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.


ఈ వార్తలు కూడా చదవండి
కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు..

ఉగాండా మహిళకు ఎబోలా లక్షణాలు.. బెంగళూరులో ఐసోలేట్..

Updated Date - May 27 , 2026 | 12:03 PM