కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు..
ABN , Publish Date - May 27 , 2026 | 08:36 AM
కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులకు దిగింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసులో భాగంగా సోదాలు చేపట్టింది.
తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులకు దిగింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసులో భాగంగా సోదాలు చేపట్టింది. మాజీ సీఎం నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రూ.1.72 కోట్ల ఈ మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ 2018-2019 మధ్యకాలంలో మాజీ సీఎం విజయన్ కుమార్తె టి.వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి ఎలాంటి సేవలు అందించలేదు. అయినప్పటికీ సీఎమ్ఆర్ఎల్ కంపెనీకి రూ.1.72 కోట్లు అక్రమంగా చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2024లో ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఈడీ విచారణను రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ సంస్థ కేరళం హైకోర్టును ఆశ్రయించింది.
నిన్న (మంగళవారం) విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు తీర్పునిచ్చిన మరుసటి రోజే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. తిరువనంతపురంలోని విజయన్ అద్దె ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
కడప జిల్లా దువ్వూరులో రెచ్చిపోయిన కామాంధుడు..
ఆన్‌లైన్ షాపింగ్, నకిలీ ఐడీ.. గతేడాది ఎర్రకోట పేలుడు వెనుక ఏం జరిగిందంటే..