కడప జిల్లా దువ్వూరులో రెచ్చిపోయిన కామాంధుడు..
ABN , Publish Date - May 27 , 2026 | 08:11 AM
కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖాజీపేటలోని ఓ లాడ్జిలో బాలికపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది.
కడప: జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. బాలిక(15)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వచ్చిన ఆమెను చూసి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దువ్వూరు మండలానికి చెందిన బాలికకు కామాంధుడు ఈశ్వర్(19) మాయమాటలు చెప్పాడు. మాటలతో మభ్యపెట్టి ఖాజీపేటలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా వదిలిపెట్టకుండా కామవాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక ఇంటికి చేరుకుంది. ఆమె పరిస్థితి చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం దువ్వూరు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు బాలికను కడప రిమ్స్‌కు తరలించారు పోలీసులు. పరీక్షలు నిర్వహించి చిన్నారి అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దువ్వూరు పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి నిర్వాహకులపైనా కేసు నమోదు అయ్యింది. కాగా, నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రజల ముందుకు రెండేళ్ల విజయాలు: అచ్చెన్న
పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాలి: టీజీ వెంకటేశ్