చంద్రబాబు నిప్పులాంటి మనిషి
ABN , Publish Date - May 27 , 2026 | 06:17 AM
‘చంద్రబాబు నిప్పులాంటి మనిషి. ఆయనను పట్టుకుంటే మాడి మసైపోతారు’ అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు.
ఆయనను పట్టుకుంటే మసైపోతారు: బుద్దా వెంకన్న
విజయవాడ అర్బన్, మే 26(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు నిప్పులాంటి మనిషి. ఆయనను పట్టుకుంటే మాడి మసైపోతారు’ అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ మహానాడు గురువారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్‌టౌన్‌లోని సీతమ్మవారి పాదాల వద్ద సుమారు రూ.18 లక్షల వ్యయంతో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో 150 అడుగుల భారీ కటౌట్‌ను బుద్దా వెంకన్న ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ప్రారంభం సందర్భంగా మంగళవారం బుద్దా మాట్లాడుతూ ఎన్టీఆర్ జన్మస్థలం, ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రజలందరికీ కనిపించేలా కటౌట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వైఎస్ హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు చేయించినా ఏమీ నిరూపించలేకపోయారని అన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని బుద్దా అన్నారు.