Share News

తెలంగాణ రైతులకు అలర్ట్.. రానున్న మూడు గంటల్లో వర్షాలు..

ABN , Publish Date - May 27 , 2026 | 11:02 AM

తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

తెలంగాణ రైతులకు అలర్ట్.. రానున్న మూడు గంటల్లో వర్షాలు..
Telangana Weather Alert

హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.


జనగామ, మహబూబ్‌నగర్, మేడ్చల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఈదురుగాలుల హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని నెలలుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించినట్లు అయ్యింది. మరోవైపు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మెట్రో సెకెండ్‌ ఫేజ్‌ కోసం పెరుగుతున్న డిమాండ్‌..

డిజిటల్‌ చెల్లింపులతో జర భద్రం

Updated Date - May 27 , 2026 | 12:11 PM