బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం.. ఎన్ని కోట్లో తెలుసా..
ABN , Publish Date - Jul 06 , 2026 | 07:05 PM
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో శీనూ నాయక్ పర్యవేక్షణలో నిర్వహించారు.
విజయవాడ, జులై 6 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో (Vijayawada Kanaka Durga Temple) హుండీలను ఈరోజు(సోమవారం) లెక్కించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో శీనూ నాయక్ పర్యవేక్షణలో నిర్వహించారు. మొత్తం 16 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా భక్తులు సమర్పించిన విరాళాల ద్వారా భారీ ఆదాయం లభించింది. హుండీల ద్వారా రూ.3 కోట్ల 39 లక్షల 53 వేల 599లు ఆదాయం సమకూరింది. అలాగే 568 గ్రాముల బంగారం, 3 కిలోల 330 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించారు.
16 రోజుల హుండీ లెక్కింపును పరిశీలిస్తే రోజుకు సగటున రూ.21 లక్షల 23 వేల మేర అమ్మవారి హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల నుంచి వస్తున్న విరాళాలు కనకదుర్గమ్మపై ఉన్న అపారమైన విశ్వాసాన్ని చూపుతుందని పేర్కొన్నారు.
హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగదు, బంగారం, వెండి రూపంలో భక్తులు సమర్పించిన కానుకలు ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు వినియోగించనున్నట్లు సమాచారం. కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా హుండీ లెక్కింపులో నమోదైన రూ.3.39 కోట్ల ఆదాయం ఆలయానికి భక్తుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
మత్స్యకారులను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And And National News
And Telugu News