వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
ABN , Publish Date - Aug 30 , 2026 | 07:00 AM
30 ఆగస్టు - 5 సెప్టెంబర్ 2026 పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫల మవుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పరిచయాలు బలపడతాయి. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. అవగాహన లేని విషయంలో జోక్యం తగదు. కొందరు మీ వ్యాఖ్యను వక్రీకరిస్తారు. ప్రముఖుల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ముఖ్యమైన వివరాలు గోప్యంగా ఉంచండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పరిస్థితులు అను కూలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడ తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఖర్చులు ప్రయోజనకరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నోటీసులు అందుకుంటారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అందరితోనూ సౌమ్యంగా మాట్లాడండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ ప్రమేయంతో వివాహసంబంధం నిశ్చయమవుతుంది.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు పట్టుదల ప్రధానం. యత్నాలు కొనసాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సాయం ఆశించ వద్దు. అయినవారే మిమ్ములను చిన్నచూపు చూస్తారు. ఆదాయం నిరాశాజనకం. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుభకార్యానికి హాజరవుతారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
సంప్రదింపులు ముందుకు సాగవు. నిరుత్సాహానికి గురవుతారు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఓర్పుతో యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. పిల్లలకు శుభం జరుగుతుంది.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవు తుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. పోయాయనుకున్న పత్రాలు లభిస్తాయి. మానసికంగా స్థిమితపడతారు.తరచూ ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
సర్వత్రా అనుకూలం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. బాకీలు వసూలవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది, కార్యక్రమాలు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. రుణవిముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అయినవారితో కాలక్షేపంచేస్తారు. పనులు వేగవంతమవుతాయి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విష యం రాబట్టేందుకు కొందరు యత్నిస్తారు. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలకు ఆమోదం లభిస్తుంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెల గండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించ వద్ద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. అనుకోని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో ముందుకు సాగుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ప్రతికూలతతో సతమతమ వుతారు. మీ కృషి ఫలించదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. పరిచయస్తుల రాక చికాకు పరుస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయ స్కరం. ఈ చికాకులు తాత్కాలికమే. పెద్దల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్థంగా ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. శుభకార్యానికి హాజరవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ ధరలు మరింత తగ్గే ఛాన్స్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News