Share News

పీఎల్‌ఏ మాజీ జనరల్‌ ఝావో జోంగ్‌కీపై వేటు!

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:37 AM

డోక్లాం ప్రతిష్టంభన, గల్వాన్‌ ఘర్షణల సమయంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)కి చెందిన వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌కు నాయకత్వం వహించిన జనరల్‌ ఝావో జోంగ్‌కీపై వేటు పడింది.

పీఎల్‌ఏ మాజీ జనరల్‌ ఝావో జోంగ్‌కీపై వేటు!

  • డోక్లాం ప్రతిష్టంభన, గల్వాన్‌ ఘర్షణలకు బాధ్యుడు

న్యూఢిల్లీ, ఆగస్టు 29: డోక్లాం ప్రతిష్టంభన, గల్వాన్‌ ఘర్షణల సమయంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)కి చెందిన వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌కు నాయకత్వం వహించిన జనరల్‌ ఝావో జోంగ్‌కీపై వేటు పడింది. ఆయన్ను చైనా తన అత్యున్నత రాజకీయ సలహా మండలి నుంచి తొలగించింది. టిబెట్‌, జిన్‌జియాంగ్‌తో పాటు భారత్‌, చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతం వెంబడి చైనా సైనిక కార్యకలాపాలను వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ పర్యవేక్షిస్తుంది. ఈ నెల 26న జరిగిన ఓటింగ్‌లో చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ (సీపీపీసీసీ) నుంచి ఝావోను తొలగించారు. అలాగే జాతి, మత వ్యవహారాల కమిటీ డిప్యూటీ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించడంతో పాటు సీపీపీసీసీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేశారు. అయితే ఈ చర్యకు గల కారణం ఏమిటన్న విషయాన్ని బీజింగ్‌ అధికారికంగా వెల్లడించలేదు. అలాగే ఆయనపై ఎలాంటి విచారణను కూడా ప్రకటించలేదు.

Updated Date - Aug 30 , 2026 | 06:39 AM