Share News

‘ఐఏఎస్‌కు నజరానా’... మత్స్యశాఖలో!

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:33 AM

ప్రభుత్వంలోని ఓ శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్‌ అధికారిణి రూ.2.5 కోట్లు ‘నజరానా’గా పుచ్చుకొని ఓ సంస్థకు ఏకపక్షంగా కాంట్రాక్టు కట్టబెట్టిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

‘ఐఏఎస్‌కు నజరానా’... మత్స్యశాఖలో!
mathsya shakha

  • చేపల టెండర్ల ఖరారులో అవినీతి!

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కలకలం

  • సీఎంవో ఆరా.. రంగంలోకి ఏసీబీ

  • ఐఏఎస్‌, ఏడీ స్థాయి అధికారి

  • మిలాఖత్‌పై విచారణ

  • చేపల టెండర్ల ఖరారులో అవినీతి!

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కలకలం, సీఎంవో ఆరా

  • రంగంలోకి ఏసీబీ.. అంతర్గత విచారణ షురూ

  • ఐఏఎస్‌,ఏడీ స్థాయి అధికారి మిలాఖత్‌పై విచారణ

  • చర్యలకు సంఘాల డిమాండ్‌

  • హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలోని ఓ శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్‌ అధికారిణి రూ.2.5 కోట్లు ‘నజరానా’గా పుచ్చుకొని ఓ సంస్థకు ఏకపక్షంగా కాంట్రాక్టు కట్టబెట్టిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరా అధికారి? అసలేం జరుగుతోంది? అని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆరా తీయగా.. ఈ అవినీతి చోటుచేసుకుంటున్నది మత్స్యశాఖలో అని అధికారులు తేల్చారు. చేపల టెండర్ల ఖరారులో ఈ అవినీతి జరిగినట్లు గుర్తించి.. పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు. ఈ అంశంపై ‘నీకు కాంట్రాక్టు.. నాకు 2.5 కోట్లు..!’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా, ఈ కథనం కలకలం సృష్టించడంతో సీఎంవో అధికారులు సమాచారం సేకరించారు. చిన్న విభాగమైన మత్స్యశాఖలో ఇంత పెద్దమొత్తంలో అవినీతి జరగడాన్ని తీవ్రంగా పరిగణించి సమగ్ర విచారణ జరుపుతున్నారు. మరోవైపు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)రంగంలోకి దిగింది. ఏసీబీ ఉన్నతాధికారి.. ఈ అంశానికి సంబంధించి ప్రాథమిక వివరాలు సేకరించారు. శనివారం ఏసీబీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఆరోపణలు వస్తున్న ఐఏఎ్‌సతోపాటు కాంట్రాక్టర్‌కు, ఐఏఎ్‌సకు మధ్య డీల్‌ కుదిర్చిన ఏడీ స్థాయి అధికారికి సంబంధించి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పైకి చిన్నదిగా కనిపించే మత్స్య శాఖలో అవినీతి.. అది కూడా ఐఏఎస్‌ స్థాయి అధికారి ప్రమేయం ఉండటంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రూ.35-40 కోట్ల టెండరు మూడేళ్లుగా ఒకే సంస్థకు ఎలా దక్కిందనే విషయాన్ని నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, మత్స్యశాఖలో జరిగిన ఈ అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

నీట్‌ - పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు

చేతిలో డబ్బులున్నాయా.. ఒకేసారి పెట్టుబడి మేలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 06:38 AM