Share News

డిజిటల్‌ పేమెంట్లలో ‘రంగారెడ్డి’ రికార్డు!

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:05 AM

రాష్ట్ర జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రంగారెడ్డి జిల్లా, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలోనూ తన సత్తా చాటుతోంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్‌ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో డిజిటల్‌ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి.

డిజిటల్‌ పేమెంట్లలో ‘రంగారెడ్డి’ రికార్డు!
Rangareddy Record

  • రూ.35వేల కోట్లతో దేశంలోనే

  • 4వ స్థానంలో నిలిచిన జిల్లా

  • టాప్‌-8లో మేడ్చల్‌, హైదరాబాద్‌

  • ఆర్బీఐ నివేదికలో వెల్లడి

  • డిజిటల్‌ పేమెంట్లలో

  • ‘రంగారెడ్డి’ రికార్డు!

  • రూ.35వేల కోట్లతో దేశంలోనే

  • 4వ స్థానంలో నిలిచిన జిల్లా

  • టాప్‌-8లో మేడ్చల్‌, హైదరాబాద్‌కు చోటు

  • ఆర్బీఐ నివేదికలో వెల్లడి

  • (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

రాష్ట్ర జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రంగారెడ్డి జిల్లా, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలోనూ తన సత్తా చాటుతోంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్‌ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో డిజిటల్‌ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత జూలై నెలలో జరిగిన యూపీఐ లావాదేవీల్లో రంగారెడ్డ్డి జిల్లా రూ.35,118.87 కోట్ల వ్యాపారంతో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కర్ణాటకలోని బెంగుళూరు అర్బన్‌ జిల్లా రూ.96,153.36 కోట్ల లావాదేవీలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, మహారాష్ట్రలోని ముంబై సబ్‌అర్బన్‌ (రూ.61,755.96 కోట్లు), పుణె (రూ.51,264.87 కోట్లు) జిల్లాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి జిల్లా తర్వాతి స్థానాల్లో చెన్నై (రూ.31.849.98 కోట్లు), మేడ్చల్‌-మల్కాజ్‌గిరి (రూ.31,747.90 కోట్లు), థానే (రూ.29,825 కోట్లు), హైదరాబాద్‌ (రూ. 24,939 కోట్లు) జిల్లాలు ఉన్నాయి. ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ‘ఫోన్‌పే’ వినియోగంలోనూ రంగారెడ్డి ముందంజంలో ఉంది. గత త్రైమాసికంలో ఒక్క ఫోన్‌పే ద్వారానే ఏకంగా రూ.1.04 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిపి దేశంలోనే మూడోస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.


ఇవీ చదవండి:

సినిమా సీన్‌ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్‌ను..

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 06:51 AM