Share News

నోటీసులు బీఎల్‌ఓలే స్వయంగా అందించాలి: సీఈవో సుదర్శన్‌ రెడ్డి

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:20 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులను బూత్‌స్థాయి అధికారులే స్వయంగా అందించాలని తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు

నోటీసులు బీఎల్‌ఓలే స్వయంగా అందించాలి: సీఈవో సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులను బూత్‌స్థాయి అధికారులే స్వయంగా అందించాలని తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. విచారణ గడువు వారం రోజులు ఉండేలా నోటీసు అందించాలని సూచించారు. విచారణ తేదీ, సమయం, ప్రదేశం గురించి బీఎల్‌ఓలు ఓటర్లకు కనీసం రెండురోజుల ముందే అప్రమత్తం చేయాలని అన్నారు. ‘సర్‌’పై జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు(ఈఆర్‌వో), సహాయ ఎన్నికల నమోదు అధికారులతో సుదర్శన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విచారణ సందర్భంగా సమర్పించాల్సిన పత్రాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.


ఇవీ చదవండి:

సినిమా సీన్‌ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్‌ను..

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 05:46 AM