నీట్ - పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:22 AM
నీట్-పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం డీసీపీ రాంరెడ్డితో కలిసి పెద్దకల్వలలోని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెం టినరీ
పెద్దపల్లి కల్చరల్/ పెద్దపల్లి రూరల్/రామగిరి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): నీట్-పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం డీసీపీ రాంరెడ్డితో కలిసి పెద్దకల్వలలోని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెం టినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆది వారం నిర్వహించనున్న పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని తెలి పారు. అభ్యర్థులను 7.30 నుంచి 8.45 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు, ఎంబీబీఎస్ క్వాలిఫి కేషన్ సర్టిఫికెట్, అడ్మిట్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు కల్పించాలని, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. సీసీటీవీ నిఘా, మొబైల్ జామర్లు, హెచ్‌హెచ్‌ఎండీ, మాన్యువల్ బాడీ ఫ్రిస్కింగ్ ద్వారా భద్ర తా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలకా్ట్రనిక్ వస్తువులు, గడియారాలు, ఆభరణాలు, షూస్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష పర్యవేక్షణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశ్నపత్రం ఐదు టైమ్‌బౌండ్ సెక్షన్లుగా ఉంటుందని, ఒక్కో సెక్షన్‌కు 42 నిమిషాల సమయం ఉంటుందని పేర్కొ న్నారు. పరీక్ష ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్ పూర్త యిన తర్వాత బయో బ్రేక్‌కు అనుమతి ఉండదన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్లు రాజయ్య, బషీరుద్దీన్, సుమన్, నిర్వాహకులు, అధికారులు పాల్గొన్నారు.