హిందూ రాష్ట్రమంటే ముస్లింలు లేని భారత్ కాదు
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:29 AM
భారత్ దేశంలో ముస్లింలు ఉండకూదని ఏ హిందువైనా అనుకుంటే, అతడు హిందువే కాదని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో..
న్యూయార్క్‌లోని ఓ సదస్సులో భాగవత్
న్యూయార్క్, ఆగస్ట్ 29: భారత్ దేశంలో ముస్లింలు ఉండకూదని ఏ హిందువైనా అనుకుంటే, అతడు హిందువే కాదని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘వన్ వరల్డ్: వన్ హ్యుమానిటీ’ సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. ‘హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను భారత్ నుంచి తరిమివేయడమా?’ అని 2018లో ముస్లింలు తనను అడిగిన ఒక ప్రశ్నను భాగవత్ ఈ వేదికగా గుర్తు చేసుకున్నారు. ‘‘హిందూ రాష్ట్రం అంటే ముస్లింలకు చోటులేనిదని కాదు. భారత్‌లో ముస్లింలకు చోటులేదని ఏ హిందువు అయినా భావిస్తే.. అతడు హిందువే కాదు. నీకు నీవు హిందువని చెప్పుకునేట్టు అయితే.. అన్ని మార్గాలూ దేవుడిని చేరుకుంటాయని నీవు విశ్వసించాలి’’అని భాగవత్ పేర్కొన్నారు. భారత్‌లో అందరూ కలసి మెలసి జీవిస్తారని చెబుతూ.. భారత్ అందరికీ నీడనిస్తుందన్నారు.