Share News

ముగ్గురు ఎంపీలపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:20 AM

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల దోషి సజ్జర్‌ కుమార్‌ నివాసానికి వెళ్లిన ముగ్గురు బీజేపీ ఎంపీలపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో..

ముగ్గురు ఎంపీలపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం

  • సజ్జన్‌ కుమార్‌ కుటుంబం పరామర్శకు వెళ్లిన నేతలు

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 29: కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల దోషి సజ్జర్‌ కుమార్‌ నివాసానికి వెళ్లిన ముగ్గురు బీజేపీ ఎంపీలపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్‌కుమార్‌ జీవిత ఖైదు అనుభవిస్తూ, అనారోగ్యంతో ఈ నెల 20న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌లో మరణించడం తెలిసిందే. దీంతో ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీలు కమల్‌జీత్‌ సెహ్రావత్‌, రామ్‌వీర్‌ సింగ్‌ బిదూరి, యోగేంద్ర చందోలియా సజ్జన్‌ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వారి చర్య పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని భావించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, ఆ ముగ్గురు ఎంపీలను శనివారం పిలిపించుకుని మాట్లాడారు. వారి చర్య పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Updated Date - Aug 30 , 2026 | 06:21 AM