Share News

అమెరికా నియంత్రణలోకి వెనెజువెలా చమురు నిల్వలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:40 AM

వెనెజువెలా దేశంలోని 65 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలను అమెరికా ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ఒప్పందం కుదిరిందని అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు.

అమెరికా నియంత్రణలోకి వెనెజువెలా చమురు నిల్వలు

  • 65 బిలియన్‌ బ్యారెళ్లపై కంట్రోలుకు కుదిరిన ఒప్పందం.. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌, ఆగస్టు 29: వెనెజువెలా దేశంలోని 65 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలను అమెరికా ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ఒప్పందం కుదిరిందని అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద చమురు ఒప్పందమని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రుబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌లు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్‌తో చర్చలు జరిపి ఈ ఒప్పందాన్ని కుదిర్చారని పేర్కొన్నారు. వెనెజువెలా మాత్రం దీనిపై ఇంతవరకు తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఈ నిర్ణయంతో అమెరికా కంపెనీలు వెనెజువెలాలో 100 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని రుబియో ప్రకటించారు.

Updated Date - Aug 30 , 2026 | 06:42 AM