Share News

ఫోన్‌ హ్యాక్‌ చేసి.. తెలిసినవారికి వాట్సాప్‌ లింక్‌ పంపించి..

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:21 PM

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్‌ను మారుస్తున్నారు. మొబైల్‌ నంబర్లను హ్యాక్‌ చేసి.. ఆ నంబర్‌ నుంచి తెలిసినవారికి, వాట్సాప్‌ గ్రూప్‌లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు.

ఫోన్‌ హ్యాక్‌ చేసి.. తెలిసినవారికి వాట్సాప్‌ లింక్‌ పంపించి..
Cyber Crime

  • సైబర్‌ నేరగాళ్ల నయా మోసం

  • బిట్‌ కాయిన్‌, ట్రేడింగ్‌ పేరిట సైబర్‌ మోసాలు

  • తెలిసినవారని నమ్మి మోసపోతున్న అమాయకులు

సంగారెడ్డి పట్టణానికి చెందిన ఒకరి మొబైల్‌ నంబర్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టండి.. అంటూ అతని సెల్‌నంబర్‌తో అన్ని వాట్సాప్‌ గ్రూప్‌ల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ సైట్‌లో పెట్టుబడులు పెడితే ధనవంతులవుతారు.. అంటూ నమ్మబలుకుతున్నారు. రూ.3,500 పెట్టుబడి పెడితే రెండు గంటల్లో రూ. 95వేలు లాభం వస్తుందని, రూ.4,500 పెట్టుబడి పెడితే రూ.1.05 లక్షలు లాభం వస్తుందని వాట్సాప్‌ లింకులు అన్ని గ్రూప్‌లకు పంపారు. తెలిసిన నంబర్‌ కావడంతో కొంతమంది అమాయకులు లింక్‌ ఓపెన్‌ చేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. లాభం ఇవ్వాలని కోరితే అవతలి సైబర్‌ మోసగాళ్లు ఇంకా పెట్టుబడి పెట్టండంటూ సూచించడంతో మోసపోయామని తెలుసుకుని ఫోన్‌ చేయడం ప్రారంభించారు. దీంతో, తన మొబైల్‌ హ్యాక్‌ అయ్యిందని సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంగారెడ్డి: సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్‌ను మారుస్తున్నారు. మొబైల్‌ నంబర్లను హ్యాక్‌ చేసి.. ఆ నంబర్‌ నుంచి తెలిసినవారికి, వాట్సాప్‌ గ్రూప్‌లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు. తెలిసిన వారి మొబైల్‌ నంబర్‌ నుంచే మెసేజ్‌లు వచ్చాయి కదా అని ఓపెన్‌ చేసి పెట్టుబడి పెడితే డబ్బులు కొట్టేస్తున్నారు.


ఏపీకే ఫైల్స్‌తో మరో తరహా మోసం

ప్రభుత్వ పథకాల్లో నమోదు చేసుకోవాలని వాట్సాప్‌ గ్రూప్‌లలో ఏపీకే (ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజ్‌) ఫైల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు పంపుతున్నారు. పథకాల్లో నమోదు చేసుకొనేందుకు ఆధార్‌, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయగానే డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల నుంచి షాపింగ్‌ యాప్‌ల ద్వారా డబ్బులు కొట్టేస్తున్నారు.


zz.jpgమొబైల్‌ హ్యాక్‌ అయ్యిందని గుర్తించండి ఇలా..

మొబైల్‌ ఫోన్‌ హ్యాక్‌ అయిందని కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. ఫోన్‌ స్పీడ్‌ ఉన్నట్టుండి తగ్గిపోతుంది. బ్యాటరీ చార్జింగ్‌ వెంటవెంటనే తగ్గిపోతూ ఫోన్‌ వేడెక్కుతుంది. మొబైల్‌లో అనుమానాస్పద ఏపీకే ఫైల్స్‌ కనిపిస్తుంటాయి. తెలియని ఓటీపీలు, మెసేజ్‌లు వస్తుంటాయి. వెబ్‌సైట్లలో సంబంధం లేని బ్రౌజర్లు ఓపెన్‌ అవుతుంటాయి. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మొబైల్‌ఫోన్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారని గుర్తించాలి. ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ చేయాలి. లేదా వెంటనే ఫోన్‌ను స్విచాఫ్‌ చేయాలి.


అప్రమత్తతతోనే మేలు

అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్‌మోసాల బారిన పడకుండా ఉండవచ్చు. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలు టెలిగ్రామ్‌, వాట్సా్‌పల ద్వారా ట్రేడింగ్‌, పెట్టుబడుల పేరిట పంపే సందేశాలు, లింకులను తెరవవద్దు. వ్యక్తిగత వివరాలు, ఖాతా నంబర్లు అడిగితే అది సైబర్‌ నేరగాళ్ల పనేనని గుర్తించాలి. వాట్సా్‌పలో వచ్చే ఏపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేయవద్దు. సైబర్‌ మోసానికిగురైనట్లు అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

మూడు రోజులైన దొరకని వృద్ధుడి డెడ్‌బాడీ.. కొనసాగుతున్న గాలింపు

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 01:21 PM