Share News

కామన్వెల్త్ గేమ్స్: ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయి.. నీరజ్ చోప్రా భావోద్వేగం

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:16 PM

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కైవసం చేసుకోవడంపై స్పందించాడు. తనతో పాటు భారత అథ్లెట్ యశ్వీర్ సింగ్ కూడా పోడియంపై నిలవడం తనకెంతో ఆనందంగా అనిపించిందని తెలిపాడు.

కామన్వెల్త్ గేమ్స్: ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయి.. నీరజ్ చోప్రా భావోద్వేగం
Neeraj Chopra

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కైవసం చేసుకోవడంపై స్పందించాడు. తనతో పాటు భారత అథ్లెట్ యశ్వీర్ సింగ్ కూడా పోడియంపై నిలవడం తనకెంతో ఆనందంగా అనిపించిందని తెలిపాడు. ఈ విజయం తనకు ఆసియా క్రీడలను గుర్తు చేసిందని తెలిపాడు. కాగా ఈ టోర్నీలో నీరజ్ చోప్రా రజతం సాధించిగా.. యశ్వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.


‘ఆసియా క్రీడల్లో నేను, సౌరవ్ ఇద్దరం పతకాలు గెలిచాం. ఇప్పుడు ఆ సందర్భంగా మళ్లీ గుర్తొచ్చింది. యశ్వీర్ అత్యంత కీలక సమయంలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం గొప్ప విషయం. ఇద్దరం కలిసి పోడియంపై నిలవడం ఆనందంగా ఉంది. జాతీయ గీతం వినిపించే ప్రతి క్షణం ప్రత్యేకమే. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగా. నా పునరాగమనం సరైన దిశలోనే సాగుతోంది. ఇంకా చాలా పోటీలు ఉన్నాయి. నా ప్రదర్శనను మెరుగుపరుచుకుంటా. ఇప్పటి వరకు నా ఆటపై సంతృప్తిగా ఉన్నా’ అని నీరజ్ పేర్కొన్నాడు.


వారందరికీ నా పతకం అంకితం: యశ్వీర్

తొలి అంతర్జాతీయ పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని యశ్వీర్ వెల్లడించాడు. ‘పోటీ ఆరంభంలో అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒక దశలో నా త్రో 81.3 మీటర్ల వద్దే ఉంది. కాంస్య పతకానికి 82 మీటర్లు సరిపోతాయని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. చివరి ప్రయత్నంలో పూర్తి స్థాయిలో విసరాలని నిర్ణయించుకున్నా. అదే నాకు పతకాన్ని అందించింది. కుటుంబ సభ్యులు, కోచ్‌లు, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ విజయం అంకితం’ అని యశ్వీర్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ క్రికెటర్‌ను హత్తుకున్న జెమీమా రోడ్రిగ్స్.. వీడియో వైరల్

కామన్వెల్త్ గేమ్స్: డెకాథ్లాన్‌లో కాంస్యం.. తొలి భారత అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు

Updated Date - Aug 01 , 2026 | 12:16 PM