Home » CWG 2026
కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేత బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీని నవ్వించాడు. పతకాలు సాధించిన అథ్లెట్లు మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సర్ నరేంద్ర.. మోదీకి చెప్పిన ఓ సరదా సంఘటన అందరినీ నవ్వించింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026 సందర్భంగా భారత మ్యాప్‌ను తప్పుగా ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్‌లో జాతీయ పతాకంలో ఈశాన్య రాష్ట్రాలు కనిపించకపోవడాన్ని గమించిన లవ్లీనా.. వెంటనే సిబ్బందికి చెప్పి సరి చేయించిన సంగతి తెలిసిందే.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిసిన అనంతరం ఏడుగురు అథ్లెట్లు అదృశ్యమైన ఘటన సంచలనం రేపింది. గ్లాస్గోలో పోటీలు ముగిసిన తర్వాత తమ జట్లతో కలిసి స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా కొందరు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజత పతకం సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తదుపరి సవాల్‌కు సిద్ధమయ్యాడు. ఆగస్టు 21 నుంచి స్విట్జర్లాండ్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక లుసానె డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగనున్నాడు.
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత జావెలైన్ త్రోయర్ యశ్‌వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ చరిత్రాత్మక విజయం వెనుక ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఇచ్చిన సలహానే కారణమని యశ్‌వీర్ వెల్లడించాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2026 సంగ్రామం ముగిసింది. గ్లాస్గో వేదికపై భారత మహిళా అథ్లెట్లు అద్భుతం చేశారు. భారత్ సాధించిన 13 స్వర్ణాల్లో 8 గోల్డ్ మెడల్స్ మహిళా అథ్లెట్ల ఖాతాలోనే చేరడం విశేషం.
నీరజ్ చోప్రా.. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికపై బరిలోకి దిగాడంటే స్వర్ణం ఖాయమైనట్లే అని అభిమానులు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఈ జావెలిన్ త్రో స్టార్ గోల్డెన్ మెడల్‌ను ముద్దాడి మూడేళ్లు గడిచిపోయింది. దీంతో అతడి కెరీర్ స్తబ్దతకు చేరిందా? లేక ప్రపంచ స్థాయి పోటీ మరింత పెరిగిందా? అనే చర్చ అథ్లెటిక్స్ వర్గాల్లో సాగుతోంది.
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026 టోర్నీలో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో విశ్వరూపం ప్రదర్శించారు. ఈ చరిత్రాత్మక విజయంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.